వైయస్ జగన్ కు మద్దతు: జయసుధ

Jayasudha
హైదరాబాద్: ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ కు తాము పూర్తిగా మద్దతిస్తామని సినీ నటి, కాంగ్రెసు శాసనసభ్యురాలు జయసుధ చెప్పారు. ఆమె సోమవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జగన్ ను కలిశారు. జగన్ ముఖ్యమంత్రి కావాలనేది తమ అభిమతమని, వైయస్ రాజశేఖర రెడ్డి అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారని ఆమె జగన్ తో భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను మర్యాదపూర్వకంగానే జగన్ ను కలిసినట్లు తెలిపారు. వైయస్ రాజశేఖర రెడ్డి వల్లనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, సహజంగానే తమ మద్దతు జగన్ కు ఉంటుందని, ప్రజలు కూడా జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ఆమె వివరించారు.

జగన్ ను ముఖ్యమంత్రి చేసే విషయంలో తాము పార్టీ అధిష్టానం నిర్ణయానికి ఎదురుచూస్తున్నామని జయసుధ చెప్పారు. ముఖ్యమంత్రి రోశయ్య విషయంలో మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నకు ఆమె నేరుగా సమాధానం ఇవ్వలేదు. అది చాలా సంక్లిష్టమైన, సున్నితమైన అంశమని, తాము జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నామని ఆమె అన్నారు. మంత్రి వట్టి వసంతకుమార్ తదితరులు జగన్ ను కలిసివారిలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+