కృష్ణలంకలో రోశయ్యకు చేదు అనుభవం

Rosaiah
విజయవాడ: వరద బాధితులను పరామర్శించడానికి వచ్చిన ముఖ్యమంత్రి కె.రోశయ్యకు మంగళవారం ఉదయం విజయవాడలోని కృష్ణలంకలో చేదు అనుభవం ఎదురైంది. దాంతో ఆయన బాధితులను పరామర్శించకుండానే వెనుదిరిగారు. గత మూడు రోజులుగా వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రికి అడుగడుగునా నిరసనలు ఎదురవుతూనే ఉన్నాయి. మంగళవారం నాడు కూడా ఆయనకు అది తప్పలేదు. తమకు సహాయం అందలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితులు ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకున్నారు.

రోశయ్య ఎంపిక చేసిన ప్రాంతాల్లో పర్యటించకుండా వేరే ప్రాంతాల్లో ఆయన పర్యటించే ప్రయత్నం చేశారు. దీంతో ఆయన వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరకట్టలకు దిగువన ఉన్న ఇళ్లను తొలగిస్తామని రోశయ్య చేసిన ప్రకటన వల్ల బాధితుల నుంచి నిరసన వ్యక్తం కావచ్చుననే ఉద్దేశంతో ఆ ప్రాంత పర్యటనను రద్దు చేసుకున్నారు. అలాగే, ప్రకాశం బ్యారేజీ వద్ద ఆయన ఆగకపోవడం కూడా తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+