ఆ పాము కరిచి ఉంటే? చంద్రబాబు నాయుడు

మంగళవారం ఆయన ఇక్కడ తమ పార్టీ నేతలతో కలిసి విలేఖరులతో మాట్లాడారు. సీఎం పర్యటనలో భద్రతాపరంగా తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలనూ అధికారులు విస్మరించినట్లు కనిపిస్తోందని, ఆయన సోఫా కింద పాము బదులు బాంబు ఉన్నా పరిస్థితి ఇంతేనా అన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మరణించిన తర్వాత కూడా అధికార యంత్రాగాన్ని మొద్దునిద్ర వీడలేదని, రోశయ్య హెలికాప్టర్ మట్టిలో కూరుకుపోవడం దీనికి నిదర్శనమన్నారు.
'ముఖ్యమంత్రికి సరైన భద్రత లేకపోతే అది మన రాష్ట్రం పరువును దెబ్బతీస్తుంది. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ప్రతి వ్యవస్థ పనితీరును కుప్పకూల్చారు. ఈ పరిస్థితిపై బహిరంగ చర్చ జరగాలి. ప్రజల వద్దకు వెళ్లకపోతే ఏమవుతుందిలే అన్న ధీమా వారిలో కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications