మోహన్ బాబుకు చిరంజీవి చురకలు

Chiranjeevi
హైదరాబాద్: కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు ప్రజారాజ్యం పార్టీ అధినేత, సహ నటుడు చిరంజీవి చురకలు వేశారు. మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) స్టార్ నైట్ కార్యక్రమ వెల్లడికి ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశానికి చిరంజీవి గానీ, చిరంజీవి సోదరులు గానీ, ఆయన బంధువులు గానీ హాజరు కాలేదు. చిరంజీవి తరఫు నటులు రాలేదంటూ మోహన్ బాబు ఆ మీడియా ప్రతినిధుల సమావేశంలో మంగళవారం వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి కొందరు సినీ నటులు రాలేదని మోహన్ బాబు అనడం సరి కాదని చిరంజీవి బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

మైక్ దొరికితే మోహన్ బాబు డైలాగులు బాగా చెప్తారని ఆయన వ్యాఖ్యానించారు. ఆ మాటలు మోహన్ బాబు తనను ఉద్దేశించే అంటే తాను సమాధానం చెప్తానని ఆయన అన్నారు. వరద బాధితులకు సహాయం అందించడానికి మా తలపెట్టిన స్టార్ నైట్ కార్యక్రమానికి తన మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు. మంగళవారం మా ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశానికి తెలుగుదేశం పార్టీకి, కాంగ్రెసుకు చెందిన నటులు హాజరయ్యారు. చిరంజీవికి సంబంధించిన నటులే హాజరు కాలేదు. దాసరి నారాయణ రావుతో పాటు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, రాజశేఖర్, మోహన్ బాబు, విష్ణు, మురళీమోహన్ హాజరయ్యారు. వరద బాధితుల సహాయం కోసం మా నవంబర్ 7వ తేదీన స్టార్ నైట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

తాను ఇటువంటి కార్యక్రమాలకు ముందుంటానని ఆయన అన్నారు. ఎవరైనా రాకపోతే ఎందుకు రాలేకపోయారని ఆలోచించాలి గానీ మోహన్ బాబులా వ్యాఖ్యలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. తానొక్కడినే కాకుండా అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, మహేష్ బాబులు కూడా రాలేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+