రోశయ్య తీరుపై చిరంజీవి ఆక్షేపణ

రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్నా పథకం వేసుకుని అత్యవసరంగా నిధులు సమీకరించుకుని వరద బాధితులకు సహాయం అందించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. బాధితులకు తగిన సహాయం అందించడంలో, పునరావాసానికి చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టడంలో చురుగ్గా వ్యవహరించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. లోపం మంత్రులదో, ముఖ్యమంత్రిదో, అధికారులదో తెలియడం లేదని, ఈ విషయంలో సమాధానం ఇచ్చుకోవాల్సింది వారేనని ఆయన అన్నారు. బాధితులను సమాధాన పరిచే విషయంలో కూడా రోశయ్య సరిగా వ్యవహరించలేకపోయారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications