భేటీలు: వైయస్ జగన్ వర్సెస్ రోశయ్య

YS Jagan
హైదరాబాద్: కాంగ్రెసులోని రెండు వర్గాలు తమ వ్యూహరచనల్లో తీరిక లేకుండా గడుపుతున్నాయి. ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న వైయస్ జగన్ శిబిరం తీరిక లేకుండా చర్చలు జరుపడంలో నిమగ్నమై ఉంది. అదే సమయంలో ముఖ్యమంత్రి రోశయ్య వర్గం కూడా ప్రతిప్యూహ రచనలో నిమగ్మమైనట్లు కనిపిస్తోంది. రోశయ్యనే ముఖ్యంమత్రిగా కొనసాగించాలనే వర్గం ఒకవైపు, జగన్ ముఖ్యమంత్రి చేయాలనే వర్గం మరో వైపు తమ ప్రయత్నాలకు పదును పెడుతున్నాయి. జగన్ ను బుధవారం కూడా పలువురు నాయకులు, మంత్రులు కలిశారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జగన్ ను మంత్రులు దానం నాగేందర్, పొన్నాల లక్ష్మయ్య కలిశారు. తాము మర్యాదపూర్వకంగానే జగన్ ను కలిసినట్లు వారు చెప్పారు. అలాగే ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కూడా జగన్ ను కలిశారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి జగన్ ను కలిశారు. ఎన్టీఆర్ తర్వాత వైయస్ రాజశేఖర రెడ్డినే ప్రజలు నమ్మారని ఆమె వైయస్ జగన్ తో భేటీ అనంతరం ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు. వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయకపోతే కాంగ్రెసు పార్టీ నష్టపోతుందని ఆమె అభిప్రాయపడ్డారు. జగన్ ను ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేస్తున్న కొంత మంది శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు బుధవారం ప్రభుత్వ విఫ్ కొండ్రు మురళి నివాసంలో సమావేశమయ్యారు. మురళి కూడా జగన్ ను కలిశారు.

కాగా, అటు రోశయ్యను బలపరుస్తున్న వర్గం కూడా క్రియాశీలకంగా మారింది. రోశయ్యను బుధవారం కాంగ్రెసు సీనియర్ నేతలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వి హనుమంతరావు కలిశారు. తాము మర్యాదపూర్వకంగానే రోశయ్యను కలిశామని, వరదలపై తాము అడిగి తెలుసుకున్నామని వారు చెప్పారు. రోశయ్యపై సొంత పార్టీ నుంచే విమర్శలు రావడం తగదని హనుమంతరావు మీడియా ప్రతినిధులతో అన్నారు. కాగా, కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి నివాసంలో తెలంగాణ సీనియర్లు బుధవారం సమావేశమయ్యారు. రోశయ్య నాయకత్వాన్ని బలపరిచే విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. జెసి నివాసంలో పాల్వాయి గోవర్దన్ రెడ్డి, అమోస్, నర్సారెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+