అయ్యో పాపం, జగన్ వర్గం: జెసి

తాను జగన్ ను ముఖ్యమంత్రిని చేయకూడదని చెప్పలేదని ఆయన అన్నారు. పార్టీ నాయకులు ఎవరి అభిప్రాయాలు వారు చెప్పారని ఆయన అన్నారు. పార్టీ అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే వారు ముఖ్యమంత్రి అవుతారని, తనకు పార్టీ అధిష్టానం నిర్ణయం శిరోధార్యమని ఆయన అన్నారు. తాను ఈ విషయంలో గోడ మీద పిల్లిలా లేనని ఆయన చెప్పారు. అధిష్ఠానం చెప్పినవారే ముఖ్యమంత్రి అవుతారనే విషయంలో భిన్నాభిప్రాయానికి తావు లేదని ఆయన అన్నారు. రోశయ్యను ముఖ్యమంత్రిగా ఎవరూ వ్యతిరేకించడం లేదని ఆయన అన్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని తాను తొలుత కోరుకున్న విషయం నిజమేనని, అయితే జగన్ ముఖ్యమంత్రిని చేయడం తన చేతుల్లో లేదని, పార్టీ అధిష్టానం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications