దీపావళి తర్వాత ఢిల్లీకి రోశయ్య

Rosaiah
హైదరాబాద్: దీపావళి పర్వదినం తర్వాత ముఖ్యమంత్రి కె. రోశయ్య ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి చెందిన నాయకులను కలవడానికి ఆయన ఢిల్లీ వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తనదైన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆయన చర్చలు జరపడానికి ఢిల్లీ వెళ్లడానికి సమయం ఖరారైనట్లు చెబుతున్నారు. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు పూనుకుని సీనియర్లకు అవకాశం కల్పించే యోచనలో రోశయ్య ఉన్నట్లు చెబుతున్నారు.

జగన్ వర్గం వ్యవహారశైలిపై కూడా ఆయన అధిష్టానానికి వివరించే అవకాశం ఉందని చెబుతున్నారు. అధికార యంత్రాంగంలో ఇప్పటికే మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టిన రోశయ్య తనదైన పాలనను సజావుగా అందించడానికి అవసరమైన మంత్రులు ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం. కె. జానారెడ్డి, జెసి దివాకర్ రెడ్డి వంటి సీనియర్లకు మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉందని చెబుతున్నారు. జగన్ కు అనుకూలంగా, తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న కొండా సురేఖ వంటివారిని మంత్రివర్గం నుంచి తొలగించేందుకు కూడా ఆయన మానసికంగా సిద్ధమైనట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇప్పటికే జెసి దివాకర్ రెడ్డి, జానారెడ్డి వంటి సీనియర్లు రోశయ్యకు పూర్తిగా మద్దతు తెలుపుతున్నారు. జగన్ వర్గం తమ రాజకీయాలను ఉధృతం చేసిన నేపథ్యంలో కాంగ్రెసు సీనియర్లు బుధవారం జెసి దివాకర్ రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. జగన్ వర్గాన్ని అడ్డుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు వారు సమావేశమైనట్లు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+