తిరుగుబాటుకు జగన్ ప్లాన్?

YS Jagan
హైదరాబాద్: కె.రోశయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపి ఆ పదవిని చేజిక్కించుకోవడానికి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వ్యూహరచన చేసినట్లు భావిస్తున్నారు. శాసనసభకు తొలిసారి ఎన్నికైన కాంగ్రెసు శాసనభ్యులు అందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాదాపు 20 మంది కాంగ్రెసు కొత్త శాసనసభ్యులు జగన్ ను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాల్సిందేనని పట్టుబట్టి పని చేస్తున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ కు మద్దతుగా శాసనసభ్యుల సంతకాలు సేకరించి గవర్నర్ కు సమర్పించడానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. జగన్ వర్గీయులు బుధవారం ప్రభుత్వ విఫ్ కొండ్రు మురళి కార్యాలయంలో సమావేశమయ్యారు. దాదాపు 10 మంది శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

జగన్ కడప నుంచి హైదరాబాదు రాగానే కాంగ్రెసులో రాజకీయ సందడి పెరిగింది. ముఖ్యమంత్రిగా రోశయ్య విఫలమయ్యారని చూపించడానికి కూడా జగన్ వర్గీయులు ప్రణాళిక రచించి అమలు చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. శాసనసభ్యులతో పాటు కొంత మంది మంత్రులు కూడా జగన్ ను ముఖ్యమంత్రిని చేసే విషయంలో గట్టి పట్టుదలతోనే ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం కొండా సురేఖ ఒక్కరే బయటపడుతున్నప్పటికీ సమయం వచ్చినప్పుడు మరింత మంది ముందుకు వచ్చే ఆవకాశాలున్నాయని రాజకీయ వర్గాలంటున్నాయి.

వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని శాసనసభ్యురాలు జయసుధ చేసిన ప్రకటనపై విరుచుకుపడిన సీనియర్ శాసనసభ్యుడు పి.శంకరరావుపై యువ శాసనసభ్యులు కొంత మంది తీవ్రంగా మండిపడ్డారు. శంకరరావుకు సవాళ్లు విసిరారు. అయితే పార్టీ అధిష్ఠానంపై తిరుగుబాటుకు పులివెందుల శాసనసభా స్థానానికి ఉప ఎన్నిక జరిగే వరకు ఆగుతారా, అంతకు ముందుగానే అందుకు పూనుకుంటారా అనేది తెలియడం లేదు. మూడు రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల తర్వాత జగన్ వర్గీయులు పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి పెంచే అవకాశాలున్నాయని భావిస్తున్నప్పటికీ కొంత సమయం తీసుకోవచ్చునని అంటున్నారు. ఏదో సమయంలో సిఎల్పీ సమావేశమో, శాసనసభ సమావేశాలో పెట్టక తప్పదు కాబట్టి ఆమె సమయంలోనే తమ సత్తా చాటడానికి వ్యూహరచన చేసుకున్నారా అనేది కూడా స్పష్టం తెలియడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+