జగన్ పార్టీ పెట్టరు: వివేకానంద రెడ్డి

పార్టీ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, కె.కేశవరావులపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. వారు సీనియర్ నాయకులు కారని, సీనియర్ సిటిజన్స్ మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసు పార్టీ అభ్యర్థులు వైయస్ రాజశేఖర రెడ్డి ఫొటో పెట్టుకుని గెలవలేదని తమ పార్టీ శాసనసభ్యుడు పి. శంకరరావు అనడంపై కూడా ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. తన ఫొటో పెట్టుకుని గెలిచారని వైయస్ తాను బతికున్నప్పుడు కూడా ఏనాడూ అనలేదని ఆయన అన్నారు. వైయస్ జీవించి ఉన్నప్పుడు మాట్లాడడానికి కూడా భయపడినవారు ఇప్పుడు నోరెత్తుతున్నారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఇందిరమ్మ రాజ్యం తేవాలని కలలు కన్నారని, ప్రభుత్వ పథకాలకు ఇందిరా గాంధీ, రాజీవ్ పేర్లు పెట్టారని, పార్టీని బలోపేతం చేయడానికే ప్రయత్నించారని ఆయన వివరించారు. తనకు ఒక్కే నాలిక ఉందని, విహెచ్, కెకెలకు మాదిరిగా రెండు నాలుకలు లేవని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications