శ్వేత సౌధంలో ఒబామా దీపావళి

వచ్చే శనివారం హిందువులు, జైనులు, సిక్కులు, ఇతర బౌద్ధులు అమెరికాలో, ప్రపంచవ్యాప్తంగా దివ్వెలను వెలిగించి దీపావళి జరుపుకుంటారని, చీకటిపై వెలుతురు, అజ్ఞానంపై జ్ఞానం విజయానికి ఇది ప్రతీకగా నిలుస్తుందని ఒబామా ఈ సందర్భంగా అన్నారు. ఇది సంతోష సందర్భమే కాదు ప్రతిస్పందనా సమయం కూడా అని, అభాగ్యులను మనం గుర్తు చేసుకున్నప్పుడు వారి అవసరాలను తీర్చేందుకు సంసిద్ధం కావడానికి పునరంకితం కావాలని సూచించే సమయం అని ఆయన అన్నారు.
అర గంటపాటు శ్వేత సౌధంలోని ఈస్ట్ రూంలో జరిగిన వేడుకల్లో భిన్న సంస్కృతుల సమ్మేళనం దర్శనమిచ్చింది. ఆసియన్స్, అమెరికన్లు, ఇండియన్లు ఈ వేడుకలో పాల్గొన్నారు. భారత వాణిజ్య మంత్రి ఆనంద శర్మ, రాయబారి మీరా శంకర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత మిఠాయిని పంచారు. పండుగ ఆహార పదార్థాలు గానీ పాటలూ నృత్యాలూ లేవు.












Click it and Unblock the Notifications