సిఎం పేషీలో కొత్తగా నలుగురు ఐఎఎస్ లు

సీఎం కార్యాలయంలో మొత్తం మూడు పోస్టులే ఖాళీగా ఉండగా, ప్రస్తుతం సీఎం పేషీలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి ప్రతాప్ ను బదిలీ చేసి... కొత్తగా నలుగురు ఐఏఎస్ అధికారులను పేషీలో నియమించుకున్నారు. ప్రస్తుతం మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న సీవీఎస్‌కే శర్మను, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న కె.రాజును, విపత్తుల శాఖ ముఖ్య కార్యద ర్శిగా పనిచేస్తున్న దినేష్ కుమార్ ను, హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా పనిచేస్తున్న కె.జవహర్‌రెడ్డిని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులుగా బదిలీ చేస్తూ బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంతరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
వైయస్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు సీఎం కార్యాలయంలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి ప్రతాప్‌ను బదిలీ చేసి ఏపీ ఇన్వెస్ట్ సీఈఓగా నియమించారు. వైయస్ పేషీలో పనిచేసిన అధికారుల్లో రోశయ్య బదిలీకి గురైనది ప్రతాప్ ఒక్కరే కావడం విశేషం. ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శిగా జన్నత్ హుస్సేన్‌ను కొనసాగిస్తున్నారు. భాను స్థానంలోకి గతంలో సాగునీటి శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేసి, వైఎస్ హయాంలో జలయజ్ఞంలో కీలక భూమిక పోషించిన సీవీఎస్‌కే శర్మను నియమించారు. సుబ్రహ్మణ్యం స్థానంలో సంక్షేమ పథకాలు, ఉపాధి హామీ పథకం అమల్లో అపార అనుభం ఉన్న కె.రాజును నియమించారు. అలాగే ప్రభాకర్‌రెడ్డి స్థానంలో దినేష్ కుమార్‌ను నియమించారు. బదీలీకి గురైన ప్రతాప్ స్థానంలో జవహర్‌రెడ్డిని నియమించారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications