మద్యం షాపులన్నీ నా తాగుడుకేనా?: కెసిఆర్

తెలంగాణ ఉద్యమానికి కెసిఆర్ ద్రోహం చేశారని వస్తున్న విమర్శలను ప్రస్తావించగా కెసిఆర్ రాక ముందు ఉద్యమం ఉప్పెనలాగా ఉంది, ఇప్పుడు ఏమీ లేదని ఆయన వ్యంగ్యంగా అన్నారు. సన్నాసులే తనను వదిలి వెళ్లారని, పిడికెడు మంది పార్టీ నుంచి వెళ్లిపోయారని ఆయన అన్నారు. తెలంగాణ సాధన ఉద్యమం దీర్షకాలికమైందని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని అన్ని వేళలా తాను నిలదీశానని ఆయన చెప్పారు. మీడియా తన పట్ల అన్యాయంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణ ఉద్యమం లేకపోతే చాలా మంది నాయకులు ఎక్కుడ ఉండేవారని ఆయన అన్నారు.
తనపై దొర అన్న విమర్శలు రావడంపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. కెసిఆర్ ఏది చేసినా దొరగానే చేశారని, దాచుకోవడం చేత కాదని ఆయన అన్నారు. తాను డబ్బులు కోసం ఉద్యమం నడపాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. తాను పుట్టుకతోనే ధనవంతుడనని, వందలాది ఎకరాల భూమి ఉండేదని, మూడంతస్థుల భవంతిలో పుట్టానని ఆయన అన్నారు. తన కుమారుడు ఉద్యమం కోసం పనిచేస్తున్నాడని, బ్యాంక్ బ్యాలెన్స్ లు లేకుండా చేసుకున్నారని, ఎమ్మెల్యే కావాలనే కోరిక ఉందని, తన కుమారుడు రామారావు వ్యక్తిస్వేచ్ఛను హరించడం భావ్యం కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications