పల్లిపట్టు గిడ్డంగిలో మరోసారి మంటలు

మృతుల్లో ఎక్కువ మంది తెలుగువారే. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు చెందినవారే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా దగ్ధమయ్యాయి. అది రైస్ మిల్లులో పెట్టిన హోల్ సేల్ బాణాసంచా విక్రయ దుకాణమని పోలీసు వర్గాలు చెప్పాయి. శిథిలాల కింది నుంచి 30 మృతదేహాలను వెలికి తీశారు. వాటిని తిరుత్తాని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీపావళి పర్వదినం కావడంతో వాటిని కొనడానికి పెద్ద యెత్తున రావడం వల్ల మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. మృతుల్లో 29 మంది ఆంధ్రులని, ముగ్గురు తమిళనాడుకు చెందినవారని సమాచారం.












Click it and Unblock the Notifications