ఆస్ట్రేలియాలో ముగ్గురు భారతీయులపై దాడి

దెర్బీ రోడ్ రిజర్వ్ సమీపంలో అండర్స్ రోడ్ లో నడుస్తుండగా నలుగురి నుంచి ఆరుగురు వ్యక్తులు వెనక నుంచి వచ్చి, భారత విద్యార్థులతో ఘర్షణ పడ్డారని, వారి వాలెట్లను, ఫోన్లను డిమాండ్ చేస్తూ ఈ ఘర్షణకు దిగారని పోలీసులు చెప్పారు. బాధితుల్లో ఒక విద్యార్థి రెండు మొబైల్ ఫోన్లు వారికి ఇచ్చేసి పారిపోయాడని వారు చెప్పారు. మిగతా ఇద్దరిని దుండగులు కొట్టారని వారన్నారు.












Click it and Unblock the Notifications