జగన్ ఫోబియా లేదు: రోశయ్య

అధిష్టానం అడిగితే జగన్ విషయంలో చెప్పాల్సిందే చెబుతానని, తాను జగన్ కు అడ్డు కానని ఆయన అన్నారు. పార్టీకి అనుభవంతో పాటు యువరక్తం, సమర్థ నాయకత్వం కూడా అవసరమేనని ఆయన అన్నారు. అధిష్టానం ఏ రోజు నిర్ణయిస్తే ఆ రోజు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటానని, పెద్ద మనిషిగా కొత్త ముఖ్యమంత్రిని ఆశీర్వదిస్తానని ఆయన చెప్పారు. మనిషిగా ఎంత కాలం బతకగలమని అనుకుంటామో ముఖ్యమంత్రి పదవి కూడా అంతే కాలమని ఆయన అన్నారు.
మంత్రుల తొలగింపు, మంత్రి వర్గ విస్తరణ, మంత్రుల చేరిక వంటి విషయాలను అధిష్టానమే చూసుకుంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications