చంద్రశేఖర రావుకు బలం లేదు: హనుమంతరావు

V Hanumantha Rao
హైదరాబాద్: తమ కాంగ్రెసు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి బలం లేదని కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు అన్నారు. ముఖ్యమంత్రి రోశయ్యపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆదివారం చేసిన ప్రకటనపై ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు. రాజకీయ పార్టీలను గందరగోళ పరిచేందుకు కెసిఆర్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెసు పార్టీ పటిష్టంగా ఉందని,కాంగ్రెసు నేతలు ఎవరూ కెసిఆర్ కు సహకరించబోరని ఆయన అన్నారు.

కెసిఆర్ ప్రకటనపై రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి కూడా మండిపడ్డారు. మరో నాలుగు రోజుల్లో కెసిఆర్ దుకాణం మూతపడుతోందని ఆయన విడిగా మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. అవిశ్వాసం ప్రతిపాదిస్తే కెసిఆర్ కున్న బలం ఎటు పోతుందో కెసిఆర్ కే తెలియదని ఆయన అన్నారు. అటువంటి స్థితిలో కెసిఆర్ అవిశ్వాస తీర్మానం ఎలా ప్రవేశపెడతారని ఆయన అడిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+