వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎట్టకేలకు సహనవాజ్ కు వీసా

By Pratap
|
Google Oneindia TeluguNews

Shahnawaz Hussain
న్యూఢిల్లీ: ఎట్టకేలకు బిజెపి పార్లమెంటు సభ్యుడు సహనవాజ్ హుస్సేన్ కు మంగళవారం వీసా లభించింది. పార్లమెంటరీ బృందంతో ఐక్యరాజ్య సమితి అసెంబ్లీ సెషన్స్ కు ఆయన వెళ్లాల్సి ఉండగా న్యూఢిల్లీలోని భారత రాయబార కార్యాలయం ఆయనకు వీసా నిరాకరించింది. దీంతో ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం వీసా లభించడంతో ఆయన న్యూయార్క్ కు బయలుదేరి వెళ్లారు. తాను అవమానానికి గురయ్యానని హుస్సేన్ అన్నారు.

హస్సేన్ అనే పేరు ఉండడం వల్ల తనకు వీసా నిరాకరించడంపై నవాజ్ అంతకు ముందు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇతర ఎంపీల దరఖాస్తులతో పాటు తన తన దరఖాస్తును కూడా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పంపిందని ఆయన చెప్పారు. ఎంపిగా, కేంద్ర మంత్రిగా పలు మార్లు తాను ఇంతకు ముందు అమెరికా వెళ్లానని ఆయన చెప్పారు. హుస్సేన్ అనే పేరు ఉన్నంత మాత్రాన తనకు వీసా నిరాకరించడంలోని ఆంతర్యం తనకు అర్థం కావడం లేదని, ఒబామా సందేశంతో ఉన్న ఈద్ శుభాకాంక్షలను కూడా అమెరికా రాయబారి తనకు పంపారని ఆయన అన్నారు. వ్యక్తిగత సంఘటనలపై తాము వ్యాఖ్యానించబోమని అమెరికా రాయబార కార్యాలయం అధికార ప్రతినిధి చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X