బిజెపి ముస్లిం ఎంపీకి వీసా నిరాకరణ

హస్సేన్ అనే పేరు ఉండడం వల్ల తనకు వీసా నిరాకరించడంపై నవాజ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇతర ఎంపీల దరఖాస్తులతో పాటు తన తన దరఖాస్తును కూడా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పంపిందని ఆయన చెప్పారు. ఎంపిగా, కేంద్ర మంత్రిగా పలు మార్లు తాను ఇంతకు ముందు అమెరికా వెళ్లానని ఆయన చెప్పారు. హుస్సేన్ అనే పేరు ఉన్నంత మాత్రాన తనకు వీసా నిరాకరించడంలోని ఆంతర్యం తనకు అర్థం కావడం లేదని, ఒబామా సందేశంతో ఉన్న ఈద్ శుభాకాంక్షలను కూడా అమెరికా రాయబారి తనకు పంపారని ఆయన అన్నారు. వ్యక్తిగత సంఘటనలపై తాము వ్యాఖ్యానించబోమని అమెరికా రాయబార కార్యాలయం అధికార ప్రతినిధి చెప్పారు.












Click it and Unblock the Notifications