హర్యానాలో ఊపందుకున్న బేరసారాలు

బిజెపి కలిసినా చౌతాలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితిలో లేదు. అయినా ప్రభుత్వ ఏర్పాటుకు చౌతాలా ఉవ్విళ్లూరుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెసును ఆహ్వానించవద్దని ఆయన గవర్నర్ ను డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలకు కాంగ్రెసు కన్నా ఎక్కువ సీట్లు వచ్చాయని ఆయన వాదిస్తున్నారు. నైతికంగా కాంగ్రెసు ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకూడదనేది ఆయన అభిప్రాయం.
చౌతాల ఉచన కలాన్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా 12,100 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. చౌతాలా కుమారుడు అజయ్ సింగ్ చౌతాలా దబ్వాలీ నియోజక వర్గంలో విజయం సాధించారు. ముఖ్యమంత్రి పదవి కోసం నాయకుడిని కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని హుడా చెప్పారు. క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తగా తాను కాంగ్రెసు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications