మేడమ్ పై పూర్తి నమ్మకం ఉంది: జగన్

YS Jaganmohan Reddy
న్యూఢిల్లీ: మేడమ్ సోనియా గాంధీపై తనకు పూర్తి విశ్వాసం ఉందని కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ చెప్పారు. సోనియాతో బేటీ తర్వాత చాలా సేపటికి ఆయన గురువారం మీడియా ముందుకు వచ్చారు. సోనియా నిర్ణయాన్ని తాను శిరసావహిస్తానని ఆయన చెప్పారు. సోనియాతో రాష్ట్ర రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు ఆయన తెలిపారు. తాను అన్ని విషయాలను సోనియాతో చెప్పినట్లు, తనకు అన్నీ తెలుసునని సోనియా అన్నట్లు ఆయన తెలిపారు. ఏం చేయాలనే విషయం తనకు తెలుసునని సోనియా చెప్పారని, సోనియా నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ఆయన అన్నారు.

కేంద్రంలో సహాయ మంత్రి ఇస్తారనే ప్రచారంపై, ముఖ్యమంత్రి పదవిపై ఊహాగానాలపై మాట్లాడడానికి ఆయన నిరాకరించారు. ఊహాగానాలపై మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. సోనియాతో జగన్ సమావేశమైన తర్వాత కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ సమావేశమయ్యారు. వీరప్ప మొయిలీతో సోనియా భేటీ ముగిసిన తర్వాత జగన్ మళ్లీ మొయిలీతో సమావేశమయ్యారు. ఆ తర్వాతే ఆయన మీడియా ముందుకు వచ్చారు. మీడియాతో ఆయన క్లుప్తంగా మాట్లాడారు. మీడియా ప్రతినిధులు వేస్తూ ఉంటే ఆయన సమాధానం చెప్పడానికి నిరాకరిస్తూ వెళ్లిపోయారు. ఆయన ఆ తర్వాత కెవిపి రామచందర్ రావు గదిలోకి వెళ్లారు. జగన్ తో సోనియా సమావేశం సందర్భంగా సోనియా సలహాదారు అహ్మద్ పటేల్ కూడా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+