హైదరాబాద్: ప్రముఖ తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు రమణ గోగులను హైదరాబాద్ నగర క్రైం బ్రాంచ్ (సిసిఎస్) పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఒక చీటింగ్ కేసులో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. పవన్ కళ్యాణ్ తమ్ముడు, బద్రి, వెంకటేష్ ప్రేమంటే ఇదేరా.. చిత్రాలకు ఆయన సంగీతాన్ని సమకూర్చారు.
తన 17వ యేట విశాఖ పట్నంలో సొంత రాక్ అండ్ రోల్ బ్యాండ్ కార్యక్రమంతో ఆయన వెలుగులోకి వచ్చారు. బెంగుళూర్ లోని లిక్విడ్ క్రిస్టల్ కంపెనీ సిఇఓగా కూడా ఆయన పనిచేశారు. ఒక కన్నడ చిత్రానికి కూడా ఆయన సంగీతాన్ని సమకూర్చారు.