న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కాంగ్రెసు పార్టీకే దక్కుతుందనడంలో సందేహం లేదని కాంగ్రెసు సీనియర్ నేత విలాస్ రావు దేశ్ ముఖ్ అన్నారు. రొటేషన్ పద్ధతిలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని ఎన్సీపి నేత ఛగన్ భుజ్ బల్ అభిప్రాయపడని నేపథ్యంలో ఆయన గురువారం ఆ విధంగా అన్నారు. తనకు ముఖ్యమంత్రి పదవిపై ఆశలేదని అంటూ రొటేషన్ పద్ధతిని ఎన్సీపి చీఫ్ శరద్ పవార్ వ్యతిరేకించారు కూడా.
కాంగ్రెసు నేతనే ముఖ్యమంత్రి అవుతారని ఎన్సిపీ నేత శరద్ పవార్ చెప్పారని విలాస్ రావు దేశ్ ముఖ్ అన్నారు. ఎన్సీపి అధిష్టానం వివరణ ఇచ్చినందు వల్ల ముఖ్యమంత్రి పదవి విషయంలో వివాదం ఉందని అనుకోవడం లేదని ఆయన అన్నారు.