కెసీఆర్ తాగి పడుకుంటేనే మంచిది: టిజి వెంకటేష్

ఆయన తాగకపోతే ఇన్ని అనర్థాలు జరుగుతాయంటే రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఆయన తాగితేనే మంచిదని టీజీ ఎద్దేవా చేశారు. కోస్తా విడిపోవాలని చెప్పడానికి కేసీఆర్‌కు ఏం హక్కుందని నిలదీశారు. అలాంటి ప్రతిపాదన ఏదైనా చేస్తే రాయలసీమ, తెలంగాణ ప్రాంత వాసులు చర్చించి నిర్ణయిస్తారన్నారు. ఒరిస్సా సరిహద్దులో పుట్టిన అచ్చమైన కోస్తాంధ్ర బిడ్డ కేసీఆర్ అని, ఆయనకు తెలంగాణ గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. తిరుపతిని రాజధానిగా చేస్తే ఫ్రీజోన్ చేసేందుకు తాను, తమ పార్టీ నేతను సంప్రదించి రక్తంతో సంతకాలు చేయిస్తానని ఆయన అన్నారు. పార్టీని ఏక తాటిపై నడపలేని కేసీఆర్ రాజ్య పరిపాలనకు తహతహలాడటం హాస్యాస్పదమన్నారు.












Click it and Unblock the Notifications