నల్గొండ: జిల్లాలోని కట్టంగూరు పోలీస్ స్టేషన్‌లో అనుమానాస్పద స్థితిలో రాజు అనే లారీ డ్రైవర్ మృతి చెందాడు. తాగి లారీ నడుపుతున్నాడని పోలీసులు రాజును శుక్రవారం అదుపులోకి తీసుకుని స్టేషన్‌లో ఉంచారు. అతను ఇవాళ తెల్లవారుజామున మృతి చెందాడు. గుండెపోటుతో మరణించినట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసులే రాజును చంపేశారని, అది లాకప్ డెత్ అని మృతుని బందువులు ఆరోపిస్తున్నారు. దీనిపై విచారణ జరిపిస్తామని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.
జిల్లాలో తరచు లారీ ప్రమాదాలు జరుగుతున్న నేపధ్యంలో లారీ డ్రైవర్లకు మద్యం పరీక్షలు చేస్తున్నామని ఆ క్రమంలో బాగా తాగి ఉన్న రాజును అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు.