కామ్రేడ్ గణపతి క్లిప్స్ సంచలనం

ఇరవై ఏళ్లలో ఎప్పుడూ బయటికి రాని గణపతి దృశ్యాలు ఇపుడు బయట పడటం వెనక వ్యూహం ఏమై ఉంటుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ఆ దృశ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయో, ఎవరు పంపించారో ఇంకా తెలియడం లేదు. ఆంధ్రజ్యోతి టీవీ గణపతితో ఇంటర్వ్యూ ఆడియోను ప్రసారం చేసినా వీడియో ఇవ్వలేదు. గణపతి కరీంనగర్ జిల్లా సారంగపూర్ మండలం బీర్‌పూర్‌కు చెందిన వ్యక్తి. ఆయన టీచర్‌గా పనిచేస్తున్నపుడు ప్రజల సమస్యలపై పోరాడుతూ.. నక్సల్స్ భావజాలానికి ఆకర్షితులై..మావోయిస్టుల్లో చేరారు. అంచలంచెలుగా అగ్రనాయకునిగా ఎదిగారు. గణపతి అసలు పేరు ముప్పాళ్ల లక్ష్మణరావు. అయనకు కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications