హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వేలలో బాలకృష్ణ ఇంటి పన్ను బకాయి

By Pratap
|
Google Oneindia TeluguNews

Balakrishna
హైదరాబాద్: పలువురు ప్రముఖులు హైదరాబాద్ మహానగర సంస్థకు వేల రూపాయల్లో ఇంటి పన్ను బకాయి పడ్డారు. వారిలో ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ కూడా ఉన్నారు. అధిక మొత్తంలో ఇంటి పన్ను బకాయి పడిన పది మంది వివరాలు, వారు చెల్లించాల్సిన మొత్తాన్ని హైదరాబాద్ నగర పాలక సంస్థ తన వెబ్ సైట్ లో పెట్టింది. బాలకృష్ణ ఇంటిపై రూ.863195.72 పైసలు బకాయి పడ్డారు. స్వర్గీయ నందమూరి బసవతారక రామారావు పేరు మీద ఇంటిపై రూ.2573975 చెల్లించాల్సి ఉంది. ఇంటి పన్ను బకాయి పడినవారిలో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు కూడా ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల భవనాలపై కూడా ఆస్తి పన్ను పేరుకుపోతోంది.

రాఘవేంద్ర రావు, ఆయన సోదరుుడ కె. కృష్ణ పేరిట ఇంటిపై 58,27,800 రూపాయలు బాకీ ఉంది. తాజ్ కృష్ణ (జివికె) రూ. 2371202 చెల్లించాల్సి ఉంది. ప్రసాద్ మీడియా కార్పోరేషన్ రూ. 2062084 చెల్లించాల్సి ఉంది. మాజీ కేంద్ర మంత్రికి చెందిన మెస్సర్స్ దీపా ఎంటర్ ప్రైజెస్ కు చెందిన ఇంటిపై 1390143 రూపాయలు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలు ఆయకర్ భవనం, ఎపి స్టేట్ ట్రేడింగ్ కార్పోరేషన్, సింగరేణి కాలరీస్ వంటివి కూడా ఇంటి పన్ను బకాయి పడ్డాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X