హైకమాండ్ నుంచి పిలుపు రాలేదు: డిఎస్

D Srinivas
హైదరాబాద్: తనకేమీ పార్టీ అధిష్టానం నుంచి పిలువు రాలేదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చెప్పారు. ఢిల్లీకి బయలుదేరే ముందు ఆయన సోమవారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తన ఢిల్లీ యాత్ర సాధారమైందేనని, ఇందులో ప్రత్యేకత ఏమీ లేదని, సభ్యత్వ నమోదు వంటి పార్టీ వ్యవహారాల గురించి పార్టీ అధిష్టానానికి చెందిన వీరప్ప మొయిలీ వంటి నాయకులతో మాట్లాడడానికి మాత్రమే తాను ఢిల్లీ వెళ్తున్నట్లు ఆయన తెలిపారు.

కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీని తాను కలుస్తానని ఆయన చెప్పారు. కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) సమావేశం ఎప్పుడు ఉంటుందో కూడా తనకు తెలియదని ఆయన అన్నారు. తాను సోనియాను కలుస్తానో లేదో కూడా తెలియదని, తాను ఢిల్లీలో ఉన్నప్పుడు సోనియా అక్కడ ఉంటారో ఉండరో కూడా తెలియదని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి కె.రోశయ్యను అధిష్టానం ఢిల్లీకి ఆహ్వానించవచ్చునని, సిఎల్పీ సమావేశం ఏర్పాటుకు సమాయత్తమవుతున్నట్లు, మంత్రి వర్గ విస్తరణకు కూడా రోశయ్యకు ఫార్ములాను ఇవ్వవచ్చునని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో శ్రీనివాస్ ఢిల్లీ యాత్ర రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+