• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏ సన్నాసీ జవాబివ్వలేదు: కెసిఆర్

By Pratap
|

K Chandrasekhar Rao
హైదరాబాద్: హైదరాబాద్ ఫ్రీజోన్ పై తాను లేవనెత్తిన అంశాలకు ఏ ఒక్క సన్నాసి కూడా జవాబు చెప్పలేదని తెంలగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు వ్యాఖ్యానించారు. తాను వాడుతున్న భాషలో మార్పు రాదని, అది తమ సొంత భాష అని ఆయన అన్నారు. తాను తన తెలంగాణ భాషను వాడుతుంటే కొంత మంది తిట్ల దండకమంటున్నారని, ఎవరి కోసమో తన ధోరణి మారదని ఆయన స్పష్టం చేశారు. తాము వాడుతున్న మాటల అర్థాలను ఆయన విడమర్చి చెప్పారు. తమ ఆంధ్ర సోదరులు కూడా కొన్ని పదాలు వాడుతున్నారని, వారు వాడే బుల్లి పదాన్ని ఇక్కడ గ్రామాల్లో వినిపిస్తే తరిమి కొడతారని ఆయన అన్నారు.

రామోజీ ఫిలిం సిటీలో అక్రమ భూములుంటే ప్రొక్లెయిన్ తో తానే దున్నేస్తానని అన్నట్లు ఆయన స్పష్టం చేశారు. రామోజీ ఫిలిం సిటీని నాగళ్లతో దున్నేస్తానని తాను అనలేదని ఆయన చెప్పారు. మీ చేతిలో అధికారం ఉన్నప్పుడు అక్రమ భూములు ఎందుకు తీసుకు రారని ఆయన కాంగ్రెసు వారిని ప్రశ్నించారు. తెలంగాణ భూములు తిరిగి వెనక్కి తీసుకోకుంటే నెత్తురు కాలువలై పారుతుందని ఆయన హెచ్చరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X