రోశయ్యను సమర్థిస్తా: కొండా సురేఖ

పార్టీ ఆదేశాలను పాటించి రోశయ్యను సమర్థిస్తానని, పార్టీ అధిష్టానం ఎవరిని ముఖ్యమంత్రిని చేసినా తనకు అభ్యంతరం లేదని ఆమె అన్నారు. తన రాజకీయ భవిష్యత్తును జగన్ చేతిలో పెడుతున్నానని ఆమె అన్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి పార్టీ అధిష్టానం సుముఖంగా లేదనే వార్తల్లో నిజం లేదని ఆమె అన్నారు. జగన్ ను ముఖ్యమంత్రి చేయకుంటే రాజీనామా చేస్తానని అన్నారు కదా విలేకరులు గుర్తు చేస్తే జగన్ సూచన మేరకు పని చేస్తానని చెప్పానని, జగన్ సూచన మేరకే తాను రోశయ్యకు మద్దతు తెలుపుతున్నానని ఆయన అన్నారు. రోశయ్యను తాత్కాలిక ముఖ్యమంత్రిగానే గుర్తిస్తున్నామని, సిఎల్పీ ఏర్పాటు చేసి నేతను ఎన్నుకోవాలని ఆమె ఇటీవల పదే పదే అన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications