వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హృతిక్ రోషన్ కు పోలీసుల హెచ్చరిక
హృతిక్ రోషన్ తల్లి పింకీ రోషన్ జన్మదిన వేడుకలకు ఆదివారం రాత్రి సినీ ప్రముఖులు సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్, కత్రినా కైఫ్, కరన్ జోహర్, పర్షాన్ అక్తర్, జెనీలియా, అమీషా పటేల్, కంగనా రనౌత్, ప్రియాంక చోప్రా, సోనాలి బింద్రే, కొత్త వధూవరులు శిల్పా శెట్టి, రాజు కుంద్రా వచ్చారు.
నిజానికి ఈ నెల 22వ తేదీనే ఈ వేడుకలు జరగాల్సింది. కానీ ఆదివారానికి వాయిదా వేశారు. ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత, తెల్లవారు జామున కూడా పెద్దగా సంగీతం పెట్టుకుని, నృత్యాలు చేయసాగారు. దీంతో పొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హృతిక్ కు హెచ్చరిక చేసి తమ దారిన తాము వెళ్లిపోయారు.
Story first published: Monday, October 26, 2009, 15:07 [IST]