'రక్త చరిత్ర' లో ఎన్టీఆర్ గా శతృఘ్న సిన్హా

ఈ చిత్రం హిందీ వెర్షన్‌లో ఆయన ఎన్టీఆర్ పాత్రను పోషిస్తారు. తెలుగు వెర్షన్ లో మోహన్ బాబు ఎన్టీఆర్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. రక్తచరిత్ర మహాభారత గాథను పోలి ఉంటుందని శత్రుఘ్నసిన్హా చెప్పారు. ఎన్టీఆర్ లాంటి మహానటుడి పాత్రలో నటించడం సవాలేనని వ్యాఖ్యానించారు. ప్రేక్షకులను మెప్పించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రాజకీయ కార్యకలాపాలతో తీరిక చిక్కడం లేదని, అయినా సినిమాల పట్ల తనకు మక్కువ తగ్గలేదన్నారు.
"రక్త చరిత్ర" షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతోంది. రాయలసీమ ఫ్యాక్షనిస్టుల నుంచి బెదిరింపులు ఉన్నందువల్ల సాధ్యమైనంత వరకు రాయలసీమ్ వెలుపలే షూట్ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. సీమ ముఠాలు షూటింగ్ కు అడ్డు పడకుండా ప్రైవేటు సైన్యం సేవలను వినియోగిస్తున్నారు.












Click it and Unblock the Notifications