హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నవంబర్ 23న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: ఎట్టకేలకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఎవియస్ రెడ్డి బుధవారం సాయంత్రం ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేశారు. నవంబర్ 23వ తేదీన పోలింగ్ జరుగుతుందని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుందని కూడా ఆయన చెప్పారు. ఈ నెల 31వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 10వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నవంబర్ 23వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.,br />
నవంబర్ 25వ తేదీన ఫలితాలు వెలువడుతాయి. డిసెంబర్ 6వ తేదీన మేయర్ ఎన్నిక, 7వ తేదీన డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతాయి. ఈ ఎన్నికలకు 5663 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. 15 వేల ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను వాడుతారు. ఇక నుంచి ఎటువంటి కొత్త హామీలు ఇవ్వకూడాదని ఎవియస్ రెడ్డి ఆదేశించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X