హైదరాబాద్: రాష్ట్ర హోం శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వద్ద హంగామా చేసిన ఓ ఆగంతకుడి పోలీసులు గురువారం ఉదయం అరెస్టు చేశారు. సబితా ఇంద్రారెడ్డి నివాసం సమీపంలో అతను అనుమానాస్పదంగా తచ్చాడుతుండడంతో అక్కడి భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద సోదాల్లో ఓ కత్తి దొరికింది.
ఆ ఆగంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారా హిల్స్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతని పేరు మల్లేష్ అని తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.