నవంబర్ లోనే తెలంగాణ ఏర్పడాలి: కెసిఆర్

K Chandrasekhar Rao
హైదరాబాద్: నవంబర్ నెలలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవంబర్ నెలలోనే ఏర్పడిందని, అందువల్ల తెలంగాణ రాష్ట్రం కూడా నవంబర్ నెలలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఆయన అన్నారు. తెలంగాణ మేధావులు, పార్టీ ముఖ్య నేతలతో ఆయన గురువారం సమావేశమయ్యారు. తెలంగాణ ఉద్యమ కార్యాచరణ, ఫ్రీజోన్ సమస్య, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలపై ఆయన ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

నవంబర్ లోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జైల్ భరో కార్యక్రమంలో తమను పోలీసులు నేరస్థుల్లా చూశారని ఆయన ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల గురించి చర్చించేందుకు రేపు శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు పోలిట్ బ్యూరో సమావేశం జరుగుతుందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+