ఆమోదం ఊహించిందే: కొండా సురేఖ

Konda Surekha
హైదరాబాద్: తాను మంత్రి పదవికి చేసిన రాజీనామా ఆమోదాన్ని తాను ముందుగానే ఊహించానని కొండా సురేఖ అన్నారు. ఎవరి కోసమో తాను రాజీనామా చేయలేదని ఆమె అన్నారు. తన రాజీనామాపై ఆమె శుక్రవారం ఒక ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్ తో మాట్లాడారు. తాను ఎవరి కోసమో రాజీనామా చేయలేదని ఆమె స్పష్టం చేశారు. తన రాజీనామాను ఆమోదించడమే మంచిదైందని, దాని వల్ల ఒత్తిడి రాకుండా ఉంటుందని ఆమె అన్నారు. ప్రజల్లో చరిష్మా ఉన్న నాయకుడు జగన్ మాత్రమేనని ఆమె అన్నారు.

ముఖ్యమంత్రి స్థానంలో తాను జగన్ ను చూడదలుచుకున్నానని ఆయన చెప్పారు. రోశయ్యపై తనకు గౌరవం ఉందని, రోశయ్యకు నేరుగా జగన్ ముఖ్యమంత్రి కావాలని అంటూ రాజీనామాను ఇవ్వడం ఇబ్బందికరంగా అనిపించిందని, దాంతో తాను రాజీనామా లేఖను గవర్నరుకు ఇచ్చానని ఆమె అన్నారు. జగన్ ను ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజల్లో బలమైన అభిప్రాయం ఉందని, ఆ సందేశం అధిష్టానానికి వెళ్లాలని తాను రాజీనామా చేశానని ఆమె అన్నారు.

తాను బెదిరించడానికో కాంగ్రెసుకు నష్టం చేయాలనో తాను రాజీనామా చేయాలని తాను భావించలేదని ఆమె అన్నారు. సముదాయించడానికి ప్రయత్నిస్తారని, అందువల్ల తాను జగన్ ను గానీ కెవిపిని గానీ కలవకపోవడానికి కారణం ఇదేనని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డితోనే మంచైనా చెడైనా ఉంటానని చెప్పానని, సోనియా తనను గుర్తు పడతారని, మంచి చేయడానికి సోనియా నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నానని ఆమె అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+