అహ్మదాబాద్: స్వైన్ ఫ్లూ మహమ్మారి ప్రముఖులను కూడా వదలడం లేదు. తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి స్వైన్ ఫ్లూ వ్యాధి సోకింది. ఆయనకు చికిత్స చేయడానికి ఒక వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. నాలుగు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని నరేంద్ర మోడీకి వైద్యులు సలహా ఇచ్చారు.
దేశవ్యాప్తంగా స్వైన్ ఫ్లూ వ్యాధి తగ్గు ముఖం పట్టిందని భావిస్తున్న సమయంలో నరేంద్ర మోడీకి స్వైన్ ఫ్లూ సోకింది. మహారాష్ట్ర స్వైన్ ఫ్లూ వ్యాధితో అట్టుడికిపోయింది. పూణే నగరం దారుణంగా దెబ్బ తిన్నది.