జగన్ కోసమైతే నేనూ రాజీనామా: సబిత

Sabitha Indra Reddy
హైదరాబాద్: మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా చేయడంపై మంత్రుల నుంచి, శాసనసభ్యుల నుంచి తీవ్ర ప్రతిస్పందనలు వ్యక్తమయ్యాయి. వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్ కు మేలు జరుగుతుందని భావిస్తే తాను కూడా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంత్రులందరూ అందుకు సిద్ధంగానే ఉన్నారని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. కొండా సురేఖ రాజీనామా ప్రభావం పార్టీపై, ప్రభుత్వంపై ఏదో మేరకు ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాల సాధనకే తాను మంత్రి వర్గంలో కొనసాగుతున్నట్లు ఆమె తెలిపారు.

కొండా సురేఖ రాజీనామా ఆమె వ్యక్తిగతమని మరో మంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని తామంతా కోరుకుంటున్నామని ఆయన అన్నారు. రాజీనామా మంచి చెడుల గురించి తానేమీ మాట్లాడలేనని, ఆమెనే మాట్లాడాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కొండా సురేఖ రాజీనామాపై మాట్లాడడానికి వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి నిరాకరించారు. ఇటువంటి పరిణామాలు సహజమేనని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి కొండా సురేఖ రాజీనామాపై ప్రతిస్పందిస్తూ అన్నారు. రాజీనామా ఆమె వ్యక్తిగతమని ఆయన అన్నారు. పార్టీపై ఆమె రాజీనామా ప్రభావం ఉండదని ఆయన అన్నారు. సురేఖ బాధలో తామూ పాలు పంచుకుంటున్నామని మరో సీనియర్ కాంగ్రెసు శాసనసభ్యుడు శంకరరావు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+