జగనే ఆ విషయం చెప్పారు: లగడపాటి

కొండా సురేఖ తన అభిప్రాయం మాత్రమే చెప్పారని ఆయన అన్నారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి కాకుండా గవర్నరుకు ఇవ్వడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆమె గవర్నరుకు సమర్పించిన లేఖ ప్రతిని ముఖ్యమంత్రికి పంపారని సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రికి పంపలేదని గుర్తు చేయగా గవర్నరుకు సమర్పించడంలో తప్పు లేదని, జర్నలిస్టులు రాజీనామా లేఖను చైర్మనుకు సమర్పిస్తే సంపాదకుడికి పంపరా అని ఆయన అడిగారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. హైదరాబాద్ పై ప్రేమ ఉంటే తెరాస గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన సవాల్ చేశారు. పోటీ చేస్తే తెరాసకు ఎన్ని సీట్లు వస్తాయో కూడా తాను చెప్తానని ఆయన అన్నారు. హైదరాబాద్ ఫ్రీజోన్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినవారు తెలంగాణవారేనని, కాదని కెసిఆర్ నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన అన్నారు. కెసిఆర్ మీడియాలో జీవిస్తున్నారని, ప్రజల్లోకి వచ్చి జీవిస్తే మంచిదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications