• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇస్రో చైర్మన్ గా రాధాకృష్ణన్ బాధ్యతలు

By Pratap
|

చంద్రయాన్ - 1
తిరువనంతపురం: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ గా కె. రాధాకృష్ణన్ శనివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. మాధవన్ నాయర్ నుంచి ఆయన ఈ బాధ్యతలను స్వీకరించారు. ఇస్రోలో 35 ఏళ్ల అనుభవం ఉన్న రాధాకృష్ణన్ చంద్రయాన్ - 1 తో పాటు పలు దేశ అంతరిక్ష ప్రాజెక్టుల్లో తన పాత్రను నిర్వహించారు.

గొప్ప ఆశతో, పెద్ద అంచనాలతో తాను ఈ బాధ్యతలను స్వీకరిస్తున్నానని, తనపై ఉంచిన విశ్వాసం తనపై భారీ లక్ష్యాన్ని పెట్టిందని, నిబద్ధత గల ఇస్రో సిబ్బంది సహకారంతో లక్ష్యాలను సాధించగలననే నమ్మకం తనకు ఉందని ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్నారు. ఇస్రో చీఫ్ గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఆయన విక్రం సారాభాయ్ అంతరిక్ష కేంద్రం డైరెక్టరుగా పని చేశారు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X