మజ్లీస్ తో పొత్తు ఆలోచన లేదు: డిఎస్

ప్రచారం పెద్దగా ఉండదని, ప్రచారంపై విజయం ఆధారపడి ఉండదని, అభ్యర్థుల ఎంపికను బట్టే విజయం ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు. ఎన్నికల్లో జయాపజయాలకు తానో, ముఖ్యమంత్రో ఎవరో ఒక్కరం బాధ్యత వహించబోమని ఆయన అన్నారు. ఎన్నికల్లో గెలుపు అందరి బాధ్యత అని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన శాసనసభ, లోకసభ ఎన్నికల్లో పెద్ద మనిషిగా కాంగ్రెసు పార్టీ ఓడినా గెలిచినా తనదే బాధ్యత అని దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారని, పరిస్థితి అలా ఉండదని ఆయన అన్నారు. మజ్లీస్ ఎన్ని స్థానాలకు పోటీ చేసినా తమకు సంబంధం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications