అబ్బో! జగన్ ఆదాయమెంతో!!

వైయస్ జగన్
న్యూఢిల్లీ : ఆదాయం పన్ను చెల్లింపులో అనూహ్యంగా కడప కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతిని దాటిపోయాడు.అడ్వాన్స్ పన్ను చెల్లింపుల ఆధారంగా రూపొందించిన అగ్ర శ్రేణి పన్ను చెల్లింపుదారుల జాబితా అగ్రస్థానం లలిత్ మోడికి దక్కింది. గత ఆర్థిక సంవత్సరం వైయస్ జగన్ మొత్తానికి కేవలం 2.92 లక్షల రూపాయలు పన్ను చెల్లించారు. ఈ సంవత్సరం తొలి ఆరు నెలలకే 6.6 కోట్ల రూపాయల పన్నును అడ్వాన్స్ గా చెల్లించారు. దీన్ని బట్టి ఆయన వ్యక్తిగత ఆదాయం 2009-10 సంవత్సరంలో 70 కోట్ల రూపాయలు దాటుతుందని అంచనా. అంటే కనీసం 22 కోట్ల రూపాయల మేరకు పన్ను ఆయన పన్ను చెల్లించారు. జగన్ గత సంవత్సరం ప్రథమార్ధంలో అసలు పన్నేమీ చెల్లించలేదు. కాని ఈ సంవత్సరం ప్రథమార్ధంలో 6.6 కోట్లు రూపాయల అడ్వాన్సు పన్ను చెల్లించారు. 100 ప్రథమ స్థాయి పన్ను చెల్లింపుదారులలో జగన్ ఒక్కరే ప్రముఖ రాజకీయ నాయకుడని చెప్పవచ్చు. జగన్మోహన్ రెడ్డిని మినహాయిస్తే క్రికెటర్లు మాత్రమే క్రితం సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎక్కువ ఆదాయాన్ని సూచించారు. ధోని, సచిన్ క్రితం సంవత్సరం ప్రథమార్ధంలో వరుసగా రూ. 1.8 కోట్లు, రూ. కోటి చెల్లించారు. ఈ సంవత్సరం మొదటి ఆరు నెలలకు ధోని చెల్లించిన మొత్తం రూ. 2 కోట్లు కాగా, సచిన్ టెండూల్కర్ కోటిన్నర రూపాయలు చెల్లించారు. యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ (భజ్జీ), వీరేంద్ర సెహ్వాగ్ వంటి ప్రముఖ క్రికెటర్లను కూడా లలిత్ మోడి వెనుకకు నెట్టివేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో మోడి ఇప్పటికే రూ. 8 కోట్ల మేరకు పన్ను చెల్లించారు. ఇది ధోని చెల్లించిన మొత్తానికి నాలుగింతలు, సచిన్ టెండూల్కర్ చెల్లించిన మొత్తానికి ఐదింతలు పైగా ఉంది. లలిత్ మోడి 2008-09 సంవత్సరం మొత్తానికి కలిపి రూ. 32 లక్షలు మాత్రమే పన్ను చెల్లించారు. ట్వంటీ 20 ఆయన ఆదాయాన్ని పెంచినట్లున్నాయి.

పన్ను చెల్లింపు విషయంలో అగ్ర స్థానంలో బాలీవుడ్ తారలు ఉన్నారు. వారిలో షారుఖ్ ఖాన్ (ఎస్ఆర్ కె) క్రితం సంవత్సరం రూ. 34.45 కోట్లు చెల్లించి అగ్ర తాంబూలం అందుకున్నారు. అక్షయ్ కుమార్ రూ. 33 కోట్లతో ద్వితీయ స్థానంలో ఉన్నారు. అయితే, ఈ సంవత్సరం ఎస్ఆర్ కెను అక్షయ్ దాటిపోవచ్చు. ఈ ఏడాది ప్రథమార్ధంలో షారూఖ్ రూ. 3.5 కోట్లు మాత్రమే చెల్లించగా అక్షయ్ రూ. 4.5 కోట్లు చెల్లించారు. షారుఖ్, అక్షయ్ తరువాత స్థానాలు సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ లవి. క్రితం సంవత్సరం సల్మాన్ రూ. 14 కోట్లు, హృతిక్ రోషన్ రూ. 14 కోట్లు చెల్లించారు. అయితే, ఈ సంవత్సరం తొలి ఆరు మాసాలలో హృతిక్ రూ. 3.5 కోట్ల మేరకు అడ్వాన్స్ పన్ను చెల్లించారు. సల్మాన్ రూ. 2.5 కోట్లు మాత్రమే అడ్వాన్స్ పన్ను చెల్లించారు. కాని ఐదవ స్థానంలో ఉన్న ఆమీర్ ఖాన్ వారిద్దరి కన్నా ఎక్కువ ఆదాయం రావచ్చని సూచిస్తూ ఈ సంవత్సరం ప్రథమార్ధంలో రూ. 3.5 కోట్లు అడ్వాన్స్ పన్నుగా చెల్లించారు. ఇది షారుఖ్ చెల్లించిన మొత్తానికి సమానం. ఆమీర్ క్రితం సంవత్సరం రూ. 11.32 కోట్ల మేరకు పన్ను చెల్లించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+