తెలంగాణ భవన్‌పై నల్లజెండా

నవంబర్ 1వ తేదీని తెలంగాణ విద్రోహదినంగా పరిగణిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. నల్లబ్యాడ్జీలతో వారు నిరసన తెలిపారు. దీంతో పోలీసులు ర్యాలీని అడ్డుకుని, విద్యార్థులను అరెస్టు చేశారు. ఉస్మానియా క్యాంపస్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.
మెదక్ జిల్లాలో తెలంగాణ విద్రోహ దినం జరిగింది. జిల్లాలో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో మంత్రి గీతారెడ్డి ప్రసంగాన్ని అడ్డుకునేందుకు తెరాస శాసనసభ్యుడు హరీశ్‌రావు ప్రయత్నించారు. దీంతో పోలీసులు హరీశ్‌రావును పలువరు తెరాస కార్యకర్తలను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications