వైయస్ హెలికాప్టర్ ప్రమాద నివేదిక అలస్యం

YS Rajasekhar Reddy
కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రయాణిస్తుండగా, ప్రమాదానికి గురైన భెల్‌-430లోని కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌కు సంబంధించిన నివేదిక ఇంకా రాలేదని సీబీఐ డీఐజీ లక్ష్మీనారాయణ తెలిపారు. మారోమారు పావురాలగుట్టను బెంగళూరుకు చెందిన ప్రత్యేక నిపుణులతో కలిసి సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. మరిన్ని ఆధారాలను సేకరించి విశ్లేషించాల్సిన అవసరం ఉందని, అందుకే ఈ ఘటనపై విచారణ ఆలస్యమయ్యే అవకాశం ఉందని లక్ష్మీనారాయణ తెలిపారు.

వైయస్ హెలికాప్టర్ ప్రమాదంపై అనేక వివాదాలు ముసురుకున్న విషయం తెలిసిందే. ఆ హెలికాప్టర్ ప్రమాదం విద్రోహ చర్య అన్న వదంతి ప్రచారంలో ఉంది. అయితే బ్లాక్ బాక్స్ వివరాలు ఇదివరకే పత్రికలకు పొక్కాయి. ప్రమాదం జరిగే సమయంలో వైయస్ కొద్దిగా కునుకు తీస్తున్నట్టు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+