ప్రజారాజ్యం జాబితాలో 51 మంది అభ్యర్ధులు

Chiranjeevi
హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను పీఆర్‌పీ విడుదల చేసింది. శుక్రవారం ఆ పార్టీ కార్యాయలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 51 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను పార్టీ నాయకుడు కోటగిరి విద్యాధరరావు ప్రకటించారు. పీఆర్‌పీకి పట్టున్న డివిజన్లలో సర్వే చేసి అభ్యర్థుల జాబితాను తయారుచేసినట్లు ఆయన తెలిపారు. కాగా కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం పార్టీ విలీనమవుతుందని వస్తున్న వార్తలు అవాస్తమని ఆయన స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ తో పొత్తు కోసం చివరిదాకా వేచిచూసి, తీరా విఫలమయ్యాక ఇప్పుడు ఎన్నికల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేస్తే భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందేమోనని కొందరు నాయకులు సందేహించారు. ప్రస్తుతం పొత్తు లేకున్నావచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి అవగాహన కుదిరే అవకాశమే అధికంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా పోటీలో ఉండటం ఎందుకనే భావనను ఎక్కువ మంది వ్యక్తీకరించినట్లు సమాచారం.

అదే సమయంలో పోటీ చేయకుండా సహకరిస్తే భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో పొత్తుకైనా, ఇతరత్రా సహకారానికైనా బాగుంటుందని కొంతమంది ప్రరాపా నాయకులకు పీసీసీ వర్గాలు సూచించినట్లు ప్రచారం జరిగింది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం తిరిగి సమావేశమైనప్పుడు ఒకరిద్దరు సీనియర్‌ నేతలు, చిరంజీవికి సన్నిహితుడైన ఓ శాసనసభ్యుడు, గ్రేటర్‌ నాయకులు మాట్లాడుతూ బలమున్న స్థానాల్లోనైనా పోటీ చేయాలని గట్టిగా వాదించినట్లు తెలిసింది. అసలు పోటీయే చేయకపోవటం వల్ల ప్రజల్లోకితప్పుడు సూచనలు పంపినట్లు అవుతుందని చెప్పినట్లు వినికిడి. ఒక రాజకీయ పార్టీగా ఇది వాంఛనీయం కాదని అన్నట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+