ఢిల్లీలో తన గోడు వెళ్ళబోసుకోనున్న దానం

నిన్న రాజీనామా చేసిన అనంతరం దానం ఇలా వ్యాఖ్యానించారు. "పార్టీ టికెట్లకు సంబంధించి జరిగిన ఆందోళన వెనుక పెద్ద శక్తుల హస్తం ఉంది. పేర్లు అవసరమైనపుడు వెల్లడిస్తా. పావులుగా వాడుకోవాలని కొందరు చూశారు. మేం పావులం కాదు" అని మంత్రి దానం నాగేందర్ అన్నారు. పీసీసీ అధ్యక్షుడు డీఎస్ ఇంటి ముందు కొందరు కావాలనే ఆందోళన చేస్తున్నారా? అన్న ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు. శుక్రవారం రాత్రి తన నివాసం వద్ద ఆయన విలేఖరులతో మాట్లాడారు. తనకు పదవులు ముఖ్యం కాదని, తిరిగి గ్రేటర్ అధ్యక్ష పదవి ఇచ్చినా తీసుకోనని స్పష్టం చేశారు. గ్రేటర్ పరిధిలో పార్టీ విజయానికి సైనికుడిలా పనిచేసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఆశయం (100సీట్లు) నెరవేరడానికి కృషి చేస్తానన్నారు.












Click it and Unblock the Notifications