• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నంది అవార్డుకు పైరవీ చేయలేదు: బాలయ్య

By Pratap
|

హైదరాబాద్: నంది అవార్డు కోసం తాను ఏ విధమైన పైరవీ చేయలేదని ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ స్ఫష్టం చేశారు. తన బావ నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు తనకు నంది అవార్డు రావడం దురదృష్టకరమని, తాను ఆ అవార్డు కోసం పైరవీ చేశానని చాలా మంది అనుకున్నారని తనకు తెలుసునని, అయితే తాను ఏ విధమైన పైరవీ చేయలేదని ఆయన ఒక కార్యక్రమంలో అన్నారు. తమ ఇంటికి వచ్చిన ఒకే నంది అవార్డు అని, దాని కోసం తానెప్పుడూ పైరవీ చేయలేదని, తన తండ్రి ఎన్టీ రామారావుకు అవార్డులు రాలేదని ఆయన అన్నారు.

తనను ఏ ప్రభుత్వం కూడా గుర్తించలేదని ప్రముఖ నటుడు నారాయణ మూర్తి అన్నారు. నంది అవార్డులు వచ్చిన చిత్రాలను ఆయన ప్రస్తావిస్తూ వాటికి రావడం సరేనని, తాను తీసిన కూతురు కోసం అవార్డు ఎందుకు రాలేదని ఆయన అన్నారు. ఆడ పిల్లలపై యాసిడ్ దాడులు జరుగుతున్న నేపథ్యంలో తాను సందేశాత్మక చిత్రం తీశానని, ఆ చిత్రానికి అవార్డు రాకపోవడం బాధగా ఉందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X