నేను భూకబ్జాదారుడిని కాను: ఆదాల

తాను కొన్నప్పుడు అసైన్డ్ భూములని తనకు తెలియదని, 2006 - 07లో తమకు ఆ విషయం తెలిసిందని ఆయన చెప్పారు. తన ప్రత్యర్థులు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన అన్నారు. దళితుల కోసం ఏ పార్టీ పోరాటం చేసినా తాను సమర్థిస్తానని, ఆ భూములను దళితులకు పంచితే సంతోషమేనని ఆయన అన్నారు. అసైన్డ్ భూములని తెలిసిన తర్వాత వాటిని తాను వదులుకున్నట్లు ఆయన తెలిపారు. తనపై కుట్ర చేస్తున్నావారెవరనేది సమయం వచ్చినప్పుడు తాను వెల్లడిస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications