ఎంపి సిఎం శివరాజ్ కు తప్పిన ముప్పు

Shivraj Singh Chauhan
గ్వాలియర్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, గవర్నర్ సిఎం ఠాకూర్ మంగళవారం విమాన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. వారు ప్రయాణిస్తున్న విమానం దిగుతున్న సమయంలో కార్లను ఢీకొట్టే ప్రమాదం నుంచి చివరి నిమిషంలో తప్పించుకుంది. విజయ్ రాజే సింధియా ఎయిర్ టెర్మినల్ రన్ వేపైకి అకస్మాత్తుగా రెండు కార్లు వచ్చాయి. అదే సమయంలో రన్ వేపై దిగుతున్న విమానం తృటిలో వాటిని ఢీకొట్టే ముప్పు నుంచి తప్పించుకుంది.

ఈ సంఘటన రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రయాణిస్తున్న విమానం దిగడానికి కొద్ది ముందుగానే సంభవించింది. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న విమానం పైలట్లు కార్లను కనిపెట్టి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా విమానాన్ని పైకి లేపారు. దాంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ తర్వాత విమానం దిగడానికి ముందు పది నిమిషాల పాటు గాలిలో చక్కర్లు కొట్టింది. ఆ రెండు కార్లు కూడా వైమానిక దళానికి చెందినవని తెలుస్తోంది. వైమానిక దళానికి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కు మధ్య సమన్వయ లోపమే దీనికి కారణమని భావిస్తున్నారు. సంఘటనపై ముఖ్యమంత్రి చౌహాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+