గాడ్సేను కెసిఆర్ తీసుకోవద్దు: లగడపాటి

Lagadapati Rajagopal
విజయవాడ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు గాడ్సేను మాత్రం ఆదర్శంగా తీసుకోవద్దని విజయవాడ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సలహా ఇచ్చారు. కెసిఆర్ ఏ పోరాటం చేసినా, ఏ దేశ నాయకుడిని ఆదర్శంగా తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కెసిఆర్ పొట్టి శ్రీరాములును, గాంధీని, ఇందిరా గాంధీని, నెహ్రూను ఎవరినైనా ఆదర్శంగా తీసుకోవచ్చునని, అయితే గాడ్సేను మాత్రం ఆదర్శంగా తీసుకోవద్దని ఆయన వ్యాఖ్యానించారు.

తెరాస చేపట్టిన భూపోరాటం రాజకీయాలతో ముడిపడి ఉందని ఆయన అన్నారు. అసైన్డ్, ప్రభుత్వ భూముల ఆక్రమణ ప్రాంతీయ సమస్య కాదని, ఆక్రమణలు ఏదో ప్రాంతానికి పరిమితం కాలేదని ఆయన అన్నారు. భూ ఆక్రమణలు అన్ని ప్రాంతాల్లో జరిగి వుండవచ్చునని, అది ప్రాంతీయ సమస్య కాదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+